Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : చైత్రశుద్ధ పంచమి విశిష్టత (ఆడియతో…)

శ్రీరామనవరాత్రులలో చెత్ర శుద్ధపంచమి విశిష్టత మరియు విధి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
చైత్ర శుద్ధపంచమిని కల్పాది అంటారు.

1. చైత్ర శుద్ధపంచమి
2. వైశాఖ శుద్ధ తదియ
3. ఫాల్గుణ కృష్ణ తృతీయ
4. మాఘ శుక్ల త్రయోదశి
5. కార్తీక శుక్ల సప్తమి
6. మార్గశీర్ష శుక్ల నవమి
7. చైత్ర అమావాస్య

ఈ ఏడు కల్పాదులనబడుతాయి. ఈ కల్పాదులలో చేసిన దానములు అక్షయ ఫలితాన్నిస్తాయి. చైత్ర శుక్ల పంచమి శుభదినాన లక్ష్మీదేవి కేశవుని ఆజ్ఞచే బ్రహ్మలోకం నుండి మనుష్య లోకానికి వచ్చినది. కావున చైత్ర శుద్ధపంచమి నాడు లక్ష్మీనారాయణులను పూజించిన వారి కి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement