Monday, January 13, 2025

ధర్మం – మర్మం : భోగి (ఆడియోతో…)

భోగి మంటలోని అంతరార్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
గోదాదేవి నెల రోజులు వ్రతం చేసి రంగనాథుడిని వివాహమాడి ఆ స్వామి చెంతకు చేరిన రోజు భోగి అంటారు. నూటికి తొంబై మంది భోగి మంటలు చలి తీవ్రతను తట్టుకోలేక వేసుకునేవి అనుకుంటారు. ఆ మంటలలో ఇంట్లోని పాత వస్తువులను ముఖ్యంగా కలపను వేయడం ఆచారం. అందులోని ఆంత ర్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అగ్ని అంటే జ్ఞానమని పండితుల నిర్వచనం. కలప అంటే అజ్ఞానం. అనగా జ్ఞానంలో అజ్ఞానాన్ని తగులబెట్టడం భోగి మంట. అజ్ఞానం, ఆరాటం, ఆశ, తుచ్ఛ అనుభవం, విపరీత ప్రవృత్తి, భ్రమ ఇవి మనలో ఉన్న కలపలు. వీటన్నింటిని జ్ఞానరూపమైన భగవంతునిలో దహింప చేయడమే భోగిమంట చెప్పే సందేశం.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement