గంగా ఆవిర్భావ వృత్తాంతంలో భాగంగా పార్వతీపరమేశ్వరుల పాణిగ్రహణ ప్రయత్నం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
బృహస్పతి తెలిపిన ఉపాయంతో మన్మధుడు తన భార్య రతీదేవి మరియు మిత్రడు వ సంతుడితో కలిసి తపోధ్యానంలో ఉన్న శివుని వద్దకు వెళ్ళెను. త్రి లోకాలను జ యించిన శంకరుడిని తన మన్మధ బాణాలు జయిస్తాయో లేదోనని సందేహిస్తూనే కర్తవ్యపాలన, పెద్దల ఆజ్ఞను పాటించాలి కావున తప్పనిసరి పరిస్థితులలో శివునిపై పూలబాణం విసిరెను. హఠాత్తుగా వికారం చెందిన తన మనస్సుకు కారణం మన్మధుడని గ్రహించిన శంకరుడు తన మూడో నేత్రం తెరిచి అతనిని భస్మం చేసెను. భయకంపితులైన దేవతలు శంకరుని స్తుతిస్తూ తారకాసురుడి బారి నుండి తమను రక్షించడానికి గౌరిని వివాహమాడాలని ప్రార్థించెను. లోక కళ్యాణ ం కోసం దేవతల ప్రార్థనను శంకరుడు ఆమోదించెను.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి