Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : పంక్తిబేధం (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యుస్త్వేక పంక్త్యాం విషమం దదాతి
స్నేహాత్‌ భయద్వా యది వార్ధహేతో:
వేదేషు దృష్టం ఋషిబిశ్చ గీతమ్‌
తాం బ్ర హ్మ హత్యాం మునయో వదంతి

ఒకే పంక్తిలో కూర్చున్న వారికి ప్రేమ వల్లనో భయం వల్లనో ధనము ఆశించో పక్షపాత బుద్ధితో వడ్డన చేసినవారు బ్రహ్మహత్య చేసిన వాడు అనగా బ్రాహ్మణుని హత్య చేసిన వానితో సమానమని వేదములు చెప్పగా ఋషులు బోధించినారు.

ఒకే పంక్తిలో కూర్చున్న నలుగురికి ఆహార పదార్థాలను బేధభావంతో వడ్డించడాని గల కారణం ప్రేమ, భయం, లేదా ముందుగా డబ్బును తీసుకోవడం . ఈ విధంగా చేయడం పంచమహాపాతకాలలో మొదటి మహా పాతకమైన బ్రహ్మహత్యతో సమానమని వేదాలు, ఋషులు ఉద్ఘోషిస్తున్నారు. వండిన పదార్థం ఏదైనా కూర్చున్న వారికి ఒకే రకంగా వడ్డించాలి. పక్షపాతం, పంక్తిబేధం చూపించరాదని విదురుడు చెప్పిన మాట.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement