Thursday, November 21, 2024

ధర్మం – మర్మం : ఆచార్య దేవోభవ (ఆడియోతో…)

పద్మపురాణంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఉత్పాదక బ్రహ్మ దాత్రో: వరీయాన్‌ బ్రహ్మద: పితా
బ్రహ్మ జన్మహి విప్రస్య ప్రేత్యచ ఇహచ శాశ్వతమ్‌

దేహమును ఇచ్చిన తండ్రి కంటే పరమాత్మ స్వరూపాన్ని బోధించు వేదాన్ని ఉపదేశించిన ఆచార్యుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణునికి వేదోపదేశము పొందుటే జన్మ. తల్లి కడుపు నుండి ప్రతీ ప్రాణి దేహంతో బయటపడినా మానవుడు మాత్రమే యుక్తా యుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడు. ఇది లౌకిక జ్ఞానము. అనగా శరీరాన్ని సౌకర్యంగా – సుఖంగా, మనస్సును – బుద్ధిని సాంఘిక మర్యాదలతో ప్రవర్తింపచేసే ప్రవర్తన లౌకిక జీవనం. ఇది మానవులకు సమాజం నేర్పుతుంది. కాని ఈ శరీరాన్ని ర క్షించేది నిలిపేది ఆత్మ. ఆ ఆత్మలో పరమాత్మ ఉండి ఆత్మను శరీరాన్ని కాపాడుతున్నాడు. ఈ ఆత్మ పరమాత్మ మన కంటికి కనపడేవి కావు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా శరీరం పోయేదే, మనసు నిలకడ లేనిదే. బుద్ధి నశించే వాటిని ఉండేవిగా బోధిస్తుంది కాని వాస్తవంగా ఇవేమి ఉండవు. ఈ జనన మరణ చక్రానికి అంతం కావాలంటే పరమాత్మను చేరాలి. పరమాత్మను చేరిన వారు మరలా జన్మించరు. ఆ పరమాత్మను గూర్చి చెప్పేది వేదము. వేదార్ధ పరిజ్ఞానంతో సంసార క్లేశాలు నశిస్తాయి మరియు శాశ్వతమైన, నిత్యమైన బ్రహ్మానందం లభిస్తుంది. కావున అలాంటి బ్ర హ్మానందాన్ని, పరబ్రహ్మను బోధించే తత్త్వాన్ని చెప్పిన గురువు కన్నతండ్రి కంటే గొప్పవాడు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement