Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – తపస్సు (ఆడియోతో..)

మహాభారతం, శాంతిపర్వంలోని సుభాషితం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

తపస్సు
అహింస స త్య వచనం ఆనృశంస్యం దమోఘృనా
ఏతత్తపో విదుర్ధీరా: న శరీరస్య శోషణమ్‌

మనస్సుతో, వాక్కుతో, శరీరంతో ఎవరినీ హింసి ంచకుండుట సత్యమునే మాట్లాడుట, ఎదుటి వారి బాధలను చూసి జాలిపడుట, ఇంద్రియ నిగ్రహము, దయ వీటిని తపము కానీ శరీరమును శుష్కింపచేయుట తపము కాదు.

తపము అను శబ్ధము యొక్క అసలు అర్థము శరీరమును శుష్కింపచేయుటే. ఇంద్రియములు కోరుకున్న వాటిని, అన్ని సౌకర్యాలను అందించకుండా శరీరమును వీలున్నంత శుష్కింప చేయడమే తపము. సంసారము కేవలము భోగ సాధనం కాదు యోగ సాధనమని తెలియజేయుటకే శరీరమును, ఇంద్రియములను, మనస్సును శుష్కింప చేయడంలోని అర్థం. ఇంద్రియములను జయించినపుడు మనోజయం లభించును. దానితో ఆత్మ స్వరూపం తెలియును. ఆత్మ జ్ఞానముతో పరమాత్మ జ్ఞానము కలుగును. అనగా సకల జగములలోనూ, ప్రాణులలోనూ, పదార్థములలోనూ పరమాత్మే ఉన్నాడని తెలియును. జగత్తంతా పరమాత్మ అయితే రాగద్వేషాలు, ఆశాపాశాలు ఉండవు. తాను హింసించే వానిలో కూడా పరమాత్మే ఉన్నాడని తెలిసినపుడు ఎదుటివారిని హింసించరు. తనకు ఏదైనా కావల్సి వస్తే దానిని పొందడానికి లేదా పొందిన దానిని రక్షించుకోవడానికి అబద్ధమాడతారు కానీ అంతటా భగవంతుడే ఉన్నపుడు ఇక పొందవలసినది ఏదీ ఉండదు కావున సత్యమునే మాట్లాడుదురు. జాలి, దయ అనేవి బాధపడుతున్న వారి విషయంలో కలగాలి.

కావున ఎదుటి వారిని హింసించకుండుట, సత్యమునే మాట్లాడుట, ఇంద్రియనిగ్రహము, జాలి , దయ కలిగి ఉండుటయే తపస్సు. కానీ తపస్సు చేస్తున్నట్లుగా నటి స్తూ దంభమును(కపటము) ప్రదర్శిస్తూ ఎవరికీ తెలియకుండా తాను పొందవల్సిన వాటి కోసం హింసను, అసత్యాన్ని ఆచరించేవారు జాలి, దయ చూపనివారు, ప దిమంది మెప్పుకోసం చేసే శరీర శోషణం తపస్సు కాదు అని శ్లోకార్థం.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement