Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)


మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
దానపద్ధత
16. ఆయాస శతలబ్ధస్య ప్రాణభ్యోపి గరీయస:
గతిరేకైవ విత్తస్య దానం శేషావిపత్తయ:

అనేకములైన ఆయాసములతో సంపాదించినది ప్రాణముల కన్నా మిన్నగా తలచే ధనమునకు దానమొక్కటే ఉత్తమ మార్గము. మిగిలిన సర్వ ఉపాయములు విపత్తులే

ఎన్నో కష్టములకు ఓర్చి సంపాదించిన ధనమును ప్రాణములకంటే మిన్నగా భావిస్తాము. ప్రాణము పోయినా సరే చిల్లి గవ్వ కూడా వదులుకోవడానికి ఇష్టపడము. ప్రాణమున్నంత వరకే నేను – నాది అనే భావన. అసలు ప్రాణము పోయిన తరువాత ధనము ఏ మవుతుందో ఎవరు అనుభవిస్తున్నారో తెలుస్తుందా. ప్రాణాపాయము సంభవించినపుడు విత్తముతో ప్రాణముల నను నిలుపు కొనవలయును, అపాయము తప్పిన తరువాత ప్రాణముతో విత్తమును సంపాదించవలయును. ప్రాణము పోయినా డబ్బివనూ అంటే ప్రాణము పోతుంది, డబ్బూ పోతుంది. ప్రాణములంటే ఎన్నడో ఒకనాడు విత్తము సంపాదించవచ్చును అందుకే సంపాదించిన ధనమునకు ఉత్తమ మార్గము దానమొక్కటే. దానము కాక ఇతర మార్గములన్నీ ఆపదలే. సంపాదన దాచుకుంటే దొంగల భయం., అతిగా సంపాదిస్తే రాజుల భయము అనగా సంపద పన్ను, ఆదాయపు పన్ను రూపంలో అన్నీ ఆపదలే. కావున సంపాదనకు దానమొక్కటే సరియైన దారి అని భావము.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement