పద్మపురాణములోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విరవణ..
చింతామణి: లోక సుఖం సురద్రుస్స్వర్గ సంపదమ్
ప్రయచ్ఛతి గురు: ప్రీత: వైకుంఠం యోగి దుర్లభమ్
స్వర్గములో చింతామణి, కల్పవృక్షము, కామధేనువు మొదలైనవి కోరికలను తీర్చేవి చాలా ఉన్నాయి. చింతామణి మన దగ్గరే ఉన్నా మనం చింతామణి దగ్గర ఉన్నా ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో లభించే అన్ని సుఖాలను అం దిస్తుంది. ఇక కల్పవృక్షము స్వర్గంలో ఉన్నా సకల సంపదలను అందిస్తుంది కానీ గురువు సంతోషిస్తే మహా యోగులు కూడా పొందలేని వైకుంఠాన్ని ప్రసాదిస్తారు. చింతామణి ఇచ్చే ఇహలోక సుఖాలు కల్పవృక్షము ఇచ్చే స్వర్గ లోక సుఖాలు నశించేవే. ఆ మణి, కల్పవృక్షం మన వద్ద ఉన్నా వాటిని స్మరించి కోరితే వచ్చే సంపదలు, సుఖాలు అశాశ్వతం. అయిపోయిన వాటిని మరలా పొందాలంటే ఆ మణి, కల్పవృక్షములను మళ్లిd కోరాలి. ఎప్పటికీ మన దగ్గర ఉండని వాటిని కోరే కంటే ఎప్పుడూ మన వద్ద ఉండే గురువు అడిగినా అడగకున్నా వైకుంఠాన్ని ప్రసాదిస్తారు. వైకుంఠం లభిస్తే మరలా అచట నుంచి తిరిగి రావడం ఉండదు. ఆ వైకుంఠం నిత్యము, సత్యము, శాశ్వతము, స్థిరము కావున శాశ్వతమైన వైకుంఠాన్ని ప్రసాదించే గురువును ఆశ్రయించి వారి దయను పొందాలి. వైకుంఠాన్ని పొందిన వారికి చింతామణి, కల్పవృక్షాలు చిన్న మట్టిబెడ్డలతో సమానం. వైకుంఠంలో ప్రతీ మణి కోటి చింతామణులతోను, ప్రతీ గోవు లక్ష కామధేనువులతో, ప్రతీ వృక్షం లక్ష కల్పవృక్షాలతో సమానం. శ్రీమన్నారాయణుడే భక్త చింతామణి,
ఆశ్రితుల కల్పవృక్షం. అలాంటి శ్రీమన్నారాయణుని ఇచ్చే గురువును ఆశ్రయించి న మ్మాలి. సంపదలు భగవంతుని మరిపిస్తాయి కావున ఆయననే మరిపించే సంపదలు ఇచ్చే చింతామణులు, కల్పవృక్షములను ఆశ్రయించకుండా భగవంతుడినిచ్చే గురువును ఆశ్రయించాలని ఈ శ్లోకంలోని ఋషి హృదయం
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి