Sunday, November 3, 2024

ధర్మం – మర్మం : జ్ఞానవిజ్ఞాన సంపన్నుడు (ఆడియోతో..)

శివమహాపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ద్వంద్వా ప్రాప్తే నజాయేతామ్‌ సుఖ దు:ఖే విజానత:
విహితా విహితే తస్య న స్యాతాంచ సురర్షయ:
ఈ దృశో విరలో లోకే గృహాశ్రమ వివర్జిత:
యదిలోకే భవత్యస్మిన్‌ దర్శనాత్‌ పాపహారక:
తీర్ధాని శ్లాఘయంతీ: స్తా: తాదృశో జ్ఞాన విత్తమమ్‌

సుఖదు:ఖములు, లాభాలాభములు మొదలగు ద్వందములు నశించినచో జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అనబడును. అలాంటి వారికి విధి నిషేధములు అంటూ ఏమీ ఉండవు ఇటువంటి వాడు లోకములో సామాన్యంగా లభించడం అరుదు. అతనికి ఆశ్రమాలు (గృహస్థు, సన్యాసం మొ||నవి) కూడా ఏమీ ఉండవు. ఇటుంటి వారు ఉన్నచో అటువంటి శ్రేష్ఠ జ్ఞానం చూస్తే చాలు సర్వ పాపములు తొలగును. అటువంటి మహానుభావుడిని పుణ్య తీర్థములు, పుణ్య క్షేత్రములు కూడా కీర్తిస్తూ ఉంటాయి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement