Thursday, October 3, 2024

ధర్మం – మర్మం : ఆధ్యాత్మిక జీవితము (ఆడియోతో..)

ఆధ్మాత్మిక జీవితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఆత్మ శబ్ధానికి ఆత్మ, పరమాత్మ, శరీరం ,మనసు, బుద్ధి అనే అయిదు అర్థాలున్నాయి. వాటిలో ఉన్నది ఆధ్యాత్మమని వాటికి సంబంధించినది ఆధ్మాత్మికం అని అర్థం. శరీరం అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే విషయాలను తె లుసుకొని ఆ విధానంగా జీవించటం ఆధ్మాత్మిక జీవనం. సకల జగత్తును సృష్టించేవాడు, రక్షించేవాడు, సంహరించే వాడు, నియమించేవాడు, అలాగే సకల శక్తులు కలవాడు అన్నీ తెలిసిన వాడు, అపారమైన కారుణ్యము, వాత్సల్యము, ఔదార్యము, సౌశీల్యము మొదలైన అనంత కళ్యాణ గుణములు కలవాడు పరమాత్మ. ప్రకృతి జీవుడు ఆ పరమాత్మ ఆజ్ఞను అనుసరించుచూ జీవించేవాడు పరమాత్మ సర్వ స్వతంత్రుడు, జీవుడు ఆ పరమాత్మకు పరతంత్రడు, ప్రకృతి పరమాత్మకు పరతంత్రమే అనగా ఆధీనమే అని తెలసి అహంకార, మమకారములను వి డిచిపెట్టి బ్రతుకును పరమాత్మ సేవగా భావించుచూ జీవించడమే ఆధ్మాత్మిక జీవతము.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement