Friday, November 22, 2024

ధర్మం – మర్మం : మంత్ర జప ప్రయోజనం (ఆడియోతో..)

మంత్ర జప ప్రయోజనం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ప్ర యోజనాన్ని ఆశించి మంత్ర జపం చేయకూడదు. ప్రయోజనాన్ని ఆశించి చేసేది వ్యాపారం, జపం, భక్తి కాదు. భగవంతుని నామాన్ని కీర్తించుట,మంత్రాన్ని జపించుట, భగవంతుని పూజించుట మన కర్తవ్యం కానీ అనాదిగా ప్రయోజనాన్ని ఆశించి జపం చేసి వాటిని పొందుతున్నారు. ప్రయోజనం తాను పొందాలనుకొంటే ఇతరులకు హానీ కలిగించాలనుకుంటారు. కర్తవ్యంగా, ధర్మంగా జపిస్తే భగవంతుడు అన్నీ ఇస్తాడు. ప్రహ్లాదుడు ఏమీ ఆశించకుండా హరి నామ జపం ద్వారా నరసింహస్వామి అనుగ్రహం పొంది 71 మహాయుగాలు రాజ్యాన్ని పాలించే అవకాశాన్ని పొందాడు. మనకేమి కావాలో భగవంతునికి తెలుసనే విశ్వాసంతో ఆయననేమీ అడుగక ఆయన ప్రసాదించినవే తీసుకొంటాననే ధృఢనిశ్చయముతో జపించాలి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement