మంత్రం జపించే విధానం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
మంత్రాన్ని పఠించరాదు, జపించాలి. పఠించడమంటే అందరికి వినేలా లేక ఒక్కరైనా తమలో తాను ఎప్పుడైనా తీరిక దొరికనపుడు పఠిస్తారు కానీ మంత్రం నియమిత సమయంలో నియమబద్ధంగా స్నానాదులు ముగించుకొని మనసు, వాక్కు, శరీరం నిర్మలంగా చేసుకొని ఏకాంతంలో పెదవులు మాత్రమే కదుపుతూ తమకు కూడా పూర్తిగా వినబడకుండా చేసేది జపం. నేటి కాలంలో సంప్రదాయాన్ని బోధించేవారు, తెలుసుకోవాలనుకొనే వారు లేకపోవడంతో మంత్ర జపం చేయుట వలన కలిగే ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి