మంత్రం, మంత్రోపదేశం స్వీకరించే విధానం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
”మంత్రం యతేన గోపయేత్” అన్నది స్మృతి. పూర్తి ప్రయత్నముతో మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి. సిడీలలో, క్యాసేట్లలో, టీవిలలో, ఫోన్లలో, ఉపన్యాసాలలో, పుస్తకాలలో మంత్రాన్ని బహిరంగపరచడం వలన మంత్రబలం, శక్తి సన్నగిల్లుతుంది. అంతేకాక అయోగ్యులకు మంత్రం అందితే సమాజానికి అనర్థం కలుగుతుంది. అందువలన గురువు గారిని ఆశ్రయిస్తే యోగ్యతను పరీక్షించి మంత్రమును అందిస్తారు కావున మూలమంత్రాలను గురుముఖతోనే ఉపదేశం పొందాలి. ఈ ప్రపంచంలో మన పని వ్యక్తిగతం కాదు కావున సమాజసంక్షేమానికి సమాజంలో ఒకరిగా మనవంతు ధర్మాన్ని మనం ఆచరించాలి.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి