అఞ్జనస్య క్షయం దృష్ట్వా వల్మీకస్య చ వర్థనమ్
అవన్ధ్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మభి:
తాత్పర్యము : కాటుక కరిగిపోవుటను, పుట్ట పెరుగుటను చూచి దినమును దాన అధ్యయన ఆరాధనాది కర్మలతో సఫలము చేయవలయును ఎంత రాశి ఉన్ననూ వాడితే క్షయమగును. ఎంత చిన్నది అయిననూ కూర్చినచో ఎరుగను అని కాటుక, వల్మీకము సూచించుచున్నవి. కావున ఇది వరకే చాలా పుణ్యమును సంసాదించినను, ఇక చాలు అని భావించరాదు. ఎంత పుణ్యాల రాశియైనను వాడితే కరిగిపోవును. అట్లే ఈ చిన్నపనితో అనగా ఒకసారి రామ అంటే, స్వామికి ఒక పూవు వేస్తే వచ్చే పుణ్యమెంత అని ఊరుకొనరాదు. చీమలు కొద్ది కొద్ది మట్టితోనే పెద్ద పుట్టను చేయును. అట్లే చిన్నగా ఆచరించినా పెద్ద పుణ్యరాశియే అగును. పుణ్యము చాలా ఉన్నది కదా అని ఉపేక్షించినచో ఎంత రాశియైనా కరిగిపోవును అని భావము. కావున నిత్యము పుణ్యమును చేచుచునే ఉండవలయును.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి