Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితంపై శ్రీమాన్‌ శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వివరణ..

అహింసానిరతా: నిత్యం వందనీయా: ప్రయత్నత:
తైరేవ ధార్యతే నిత్యం చరాచర మిదం జగత్‌

అహింసా ధర్మం యందు ఆసక్తి కలవారు కనబడినపుడు వారికి అవకాశం ఉన్న ప్రతి నిత్యం నమస్కరించవలెను. చరాచరమైన ఈ జగత్తంతా అహింసా శీలురైన వారి తోటే మోయబడుచున్నది. న్యాయంగా ఈ జగత్తును ఆదిశేషుడు, కూర్మమో, అష్టదిగ్గజాలలో ధరించుట లేదు(మోయుట లేదు). అహింసా శీలురే మోయుచున్నారు. ఒకరి బరువును తాము మోయాలి అనుకున్నవారు అహిం సాశీరులే. బాధపడిననూ హాని కలిగిననూ తమకెందుకు అనుకున్నవారు ఏ బరువును మోయరు. ఏ ఒక్కరు బాధపడకూడదు అనుకున్న వారే ఎదుటి వారి బరువును తాము మోయుదురు. కావున అహింసా శీలురే ఈ జగతిని ధరించుచున్నారని భావం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement