Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో..)

మహాభారతంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

అభివాదే కృతే యస్తు నకరోత్యాభి వాదనమ్‌
ఆశీర్వా కురుశార్దూల సయాతి నరకం ధృవమ్‌

నమస్కరించిన వారికి ప్రతి నమస్కారం కానీ చిన్న వారైతే ఆశీర్వదించని వారు నరకమును పొందెదరు.

మనతో సమానమైన వారు, మనకం టే పెద్దవారు, ఉత్తమ విద్యావంతులు, గుణవంతులు, బుద్ధిమంతులు, సచ్చరిత్ర, సదాచారము కలవారు నమస్కరించినపుడు ప్రత్యభివాదం చేయవలెను లేక నమస్కరించిన వారు చిన్న వారు, శిష్యులు అయినచో ఆశీర్వాదం అందజేయాలి. ఈ విధంగా ప్రత్యభివాదము, ఆశీర్వాదము చేయకుండుట శాస్త్రబద్ధంగా ఎదుటవారిని నిరాదరణ చేయుటగును. అన్ని పాపముల కంటే అనాదారణ గొప్ప పాపము కావున ఈ విధంగా చేయువారు నరకము పొందెదరు. ఆదరించకున్ననూ అనాదరణ మాత్రం చేయరాదు.

ఎదుటవారి ఆదరణను గుర్తించలేక నిరాదరణ చేసారని భావించిన వారు జీవితంలో కష్టాలను, పరమున నరకమును పొందెదరు. ఉదాహరణకు శంకర భగవానుడు చేసిన అంతర్యామి ప్రత్యభివాదమును ప్రత్యుత్తానము గుర్తించని దక్షుడు మరణము పొంది తిరిగి బ్రతికెను.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement