Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

వృత్తం యత్నేన సంరక్షేత్‌ విత్తమేతి చ యాతిచ
అక్షీణ విత్తత: క్షీణ: వృత్త తస్తు హతో హత:

ఆచారము ప్రవర్తన నడవడి వీటిని వృత్తమందురు. ఆ వృత్తమును ప్రయత్నపూర ్వకముగా రక్షించుకొనవలయను. ధనము వస్తూ పోతూ ఉండును. ధనము క్షీణించిన వాడైననూ క్షీణించిన వాడు కాడు. ప్రవర్తన క్షీణించిన వాడు నశించిన వానితో సమానము.

‘సత్ప్రవర్తన అసి ధారా వ్రతము’ అనగా క త్తి అంచుపై నడుచుట యందురు. కొంచెం కాలు లేదా వేలు ప్రక్కకు పోతే తెగుతుంది. నడవడిని చెడగొట్టేవి తప్పించేవి చాలా ఉంటాయి. వాతావరణం, మిత్రులు, అలవాట్లు, యువతులు వ్యసనపరులు వీరిలో ఏ ఒక్కటి ఆకర్షించినా భ్రష్టుడగును. మనసు అనుక్షణం తప్పించాలనే చూస్తుంది కానీ మిత్రులు వ్యసనాలకు బానిసలను చేస్తారు, పరిస్థితులు, అవసరాలు ఒకసారి ధర్మం తప్పితే ఏం జరుగుతుంది అంటూ దుష్ట ప్రవృత్తిలోనికి లాగుతాయి అందుకే అనుక్షణం జాగరూకతతో ప్రయత్నపూర్వకంగా తన నడవడిని తానే నియమించుకోవాలి. ధనమును రక్షించినా రక్షించకున్నా నిలిచేది కాదు. అది వస్తూపోతూ ఉంటుంది. ధనము లేని వాడు లేనివాడు కాదు కానీ మంచి నడవడిలేని వాడే లేని వాడు. మన రామాయణ భారతాదులు ప్రవర్తననే బోధించాయి. మాట తప్పరాదు, అబద్ధమాడరాదు, ధర్మమునే ఆచరించాలనే ఈ నియమాల మీదనే రామాయణాదులు నడిచాయి. ఆ నియమపాలన కోసం రాజ్యాన్ని, భార్యను, పుత్రులను, చివరికి ప్రాణాలను కూడా అర్పించారు. అందుకే వృత్తమును ప్రయత్నపూర ్వకముగా రక్షించుకొనవలయును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూనే శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement