మహాభారతంలోని అనుశాసన పర్వములోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
బ్రాహ్మణత్వము…
జన్మ విప్రస్య రాజేంద్ర ధర్మార్ధ మిహగ కథ్యతే
ఉత్పన్న: సర్వ సిద్ధ్యర్ధం యాతి బ్రహ్మ సదా నృప
సచాపి జాయమానస్తు పృధీవ్యా మిహ జాయతే
భూతానాం ప్రభవాయైవ ధర్మ కోశస్య గుప్తయే
అనసూయా దయా క్షాంతి: అనాయాసంచ మంగళమ్
అకార్పణ్యం తాధా శౌచం అస్పృహా చ కురూద్వహ
అష్టౌగుణా: బ్రాహ్మణస్య ఇహాముత్ర శుభావహా:
బ్రాహ్మణుడు ధర్మ రక్షణ కొరకు ధర్మ ప్రబోధం కొరకు సకల సిద్ధుల కొరకే పుట్టును. సకల సిద్ధులను పొందిన వాడు బ్రహ్మ భావమును పొందును. భూమి యందు బ్రాహ్మణుని పుట్టుక సకల ప్రాణుల సుఖశాంతులకు, ధర్మ కోశ రక్షణకు జరుగును. అనసూయ, దయ, శాంతి,అనాయాసము, మంగళము కలిగి, లోభిత్వము, శౌచము , ఆశ లేకుండుట ఈ 8 గుణములు ఉన్నవారు బ్రాహ్మణుడు అనబడును. అట్టి బ్రాహ్మణుడు ఇహ పరములలో శుభమును కలిగించును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి