Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 34(1) (ఆడియోతో…)

మహాభారతంలోని అనుశాసన పర్వములోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శ్రేష్ఠులు…
భూతానాం ప్రాణిన: శ్రేష్ఠా: ప్రాణినాం బుద్ధి జీవిన:
బుద్ధి మత్సునరా శ్రేష్ఠా నరేషు బ్రాహ్మణా స్మృతా:
బ్రాహ్మణషుచ విద్వాంస విద్వత్సు కృత బుద్ధయ:
కృత బుద్ధిషు కర్తార: కర్తృషు బ్రహ్మవేదిన:

సకల భూతములలో ప్రాణం కలవి శ్రేష్ఠమైనవి, ప్రాణం గల వాటిలో బుద్ధితో బ్రతుకువారు శ్రేష్ఠులు, ఆ బుద్ధిమంతులలో మానవులు శ్రేష్ఠులు, మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు, బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు, విద్వాంసులలో మనో నిగ్రహము కల వారు శ్రేష్ఠులు.,మనో నిగ్రహము కలవారిలో బ్రహ్మ జ్ఞానము కలవారు శ్రేష్ఠులు. బ్రహ్మ జ్ఞానము కలవారే బ్రాహ్మణులు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement