Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 33 (ఆడియోతో…)

మహాభారతం శాంతిపర్వంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఆచారము
ఆచార: ప్రధమో ధర్మ: శ్రుత్యుక్తస్య నరోత్తమ
యస్మాత్‌ దస్మిన్‌ సమాయుక్త: నిత్యం స్యాత్‌ ఆత్మవాన్‌ ద్విజ:
ఆచారాత్‌ విచ్యుతో విప్ర: నవేద ఫలమశ్నుతే
ఆచారేణచ సం యుక్త: సంపూర్ణ ఫల భాగ్‌ భవేత్‌
సర్వస్య తపసో మూలమ్‌ ఆచారం జగృహు: పరమ్‌
నాధార్మే నాగమ: కశ్చిత్‌ మనుష్యాణాం ప్రవర్తతే
ఇతరే ష్వాగమాస్తాత ధర్మశ్చ కురునందన

అన్ని ధర్మములు కంటే ప్రధమ ధర్మము ఆచారమే. ఆచారమనగా వేద శాస్త్రములచే విధించబడిన నడవడి అని, సకల వేదములు తెలిపినవి. మనోనిగ్రహము, ఆత్మజ్ఞానము ఆచారం వలన కలుగును. ఆచారములను తప్పిన మానవుడు విశేషించి బ్రాహ్మణుడు వేద ఫలమును పొందజాలడు. ఆచారము గల నరుడు సంపూర్ణ ఫలమును పొందును. సకల తపములకు మూలము ఆచారమే అని పెద్దలు నిర్ణయించిరి. అధర్మముతో ఏ శాస్త్రమూ, ఏ ధర్మమూ మానవులలో ప్రవర్తించదు. ఆచారము
తోటి ఆగమము, ధర్మము సిద్ధించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement