స్కాంద పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
రామస్తు విపినం గత్వా స్వయం శత్రుం సమాగతమ్
తాటకాం సహమారీచం సుబాహు ప్రభృతీన్ రిపూన్
యుద్ధే క్లేశం సతుప్రాప్య అవధీత్ దు:ఖ భాజన:
అత: శత్రుం సమాహూయ వధం కుర్యాత్ విచక్షణ :
రామచంద్రుడు గురువు వెంట తాటకి వద్దకు వెళ్ళాడు. తాటకి రాముని కళ్ళల్లో దుమ్ముకొట్టి, రాళ్ళతో కొట్టి, భయపెట్టి బెదిరించినది. అలాగే విశ్వామిత్రుని యజ్ఞభూమికి వెళ్ళి మారీచునిని దూరంగా పంపి సుబాహుని వధించి శత్రు నివాసం దగ్గర తాను నివాసం ఏర్పరుచుకుని పద్నాలుగు వేల మందితో యుద్ధక్లేశాన్ని పొందాడు. కాబ్టటి శత్రువును మన దగ్గరకు పిలిచి కష్టపడకుండా సంహరించిన వాడే రాజనీతి దురంధరుడు.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి