Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 30(2)

స్కాంద పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

రామచంద్ర:
రామ: స్వమాతృ దాసీమ్‌ మంధరాం అవిగణయ్య
యత్‌ రాజ్యప్రాప్త్యై నియక్తోపి వనాని నిజగామహ
కృష్ణస్తు మధురాయాంచ ప్రవిశ్య కుశలీ బుధ:
కుబ్జాం త్రివక్రాం సంపూజ్య శత్రునాశం చకారస:
బంధూనాం సమ్ముదం దత్వా యశోభాగ భవత్‌ హరి:

శ్రీ రామచంద్రుడు తన పినతల్లి కైక దాసి అయిన మందరను అంతగా ఆదరము చేయనందున రాజ్యప్రాప్తికై నియోగించబడినను వనవాసమును పొందెను. ఇక శ్రీ కృష్ణుడు
మధురా నగరమున ప్రవేశించిన వెంటనే కంసుని దాసి అయిన కుబ్జను సౌందర్యదానాదినా(సౌందర్యము మొదలగు వాటితో) సత్కరించెను. కావున శత్రునాశము జరిగిబంధువులకు సంతోషమును, రాజ్య పాలనాధికారము, గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement