Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 24 (ఆడియోతో…)

పద్మపురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

అప్రార్థితాని దు:ఖాని యధైవాయాంతి దేహినామ్‌
సుఖానపి తథా మన్యే దైన్యమత్ర అతిరిచ్యతే

ప్రాణులకు కోరకున్నా, ఆశించకున్నా, యాచించకున్నా కష్టాలు, బాధలు, దు:ఖాలు, సమస్యలు ఎలా వస్తాయో సుఖాలు, సంతోషాలు, సంపదలు అలాగే వస్తాయి.
సుఖాలు, సంప దలు, సంతోషాలు, భోగాలు కావాలని ప్రతీ దేవుణ్ని ప్రార్థించి దానికోసం వ్రతాలు, నోములు, దానధర్మాలు చేస్తారు. ఏ నోము నోచకుండానే ఏ వ్రతమూ
చేయకుండానే ఏ దేవుడికీ దండం పెట్టకుండానే కష్టాలు వస్తున్నప్పుడు సుఖాలు, సంతోషాలు, భగవంతుని కోరినంత మాత్రాన రావు కదా! మన ప్రయత్నం లేకుండా కష్టాలు మన ప్రమేయం లేకుండా సుఖాలు వచ్చినప్పుడు కష్టాలు వస్తే క్రుంగిపోవడం, సుఖాలు వస్తే ఎగిరి గంతేయడం తగదు. మనకు రావాల్సిన దానిని మన ప్రమేయం లేకుండానే భగవంతుడు ఇస్తున్నాడు. కావున సాధించానని గర్వము, సాధించలేకపోయాయని చింత అజ్ఞానులకే కలుగుతాయి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement