లక్ష్మీతంత్రంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….
ఇజ్యా ఆచార దయా అహింసా దాన స్వాధ్యాయ కర్మణామ్
అయంతు పరమోధర్మ: యధ్యోగేన ఆత్మ దర్శనమ్
ఆరాధన, ఆచారము, దయ, అహింస, దానము, వేదశాస్త్ర అధ్యయనము, జ్ఞాన సంపాదనము వీటన్నింటికి పరమ ధర్మం, పరమ లక్ష్యం యోగముతో పరమాత్మను సాక్షాత్కరించుకోగల్గుటయే.
యజ్ఞము – స్వర్గ సుఖాలకు, ఆచారము – దేహ ఆరోగ్యానికి, దయ – శరీరానికి, మనస్సుకు కలిగే బాధను తొలగించడానికి, దానము – ధనవంతుడనని చాటడానికి, వేద శాస్త్ర అధ్యయనము – విద్వాంసుడిగా పేరు పొందడానికి, ఇతర ధర్మాచరణ – కీర్తిని కలిగించడానికే అయిన నాడు అవేవీ ధర్మములు అనిపించుకోవు. ఇవన్నీ యోగమును పెంపొందింప చేసి ఆ యోగముతో పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగించిన నాడే వాటికి ధర్మత్వం సిద్ధిస్తుంది.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి