Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 14(1) (ఆడియోతో…)

గరుడ పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

దురాచారోపి సర్వాశీ కృతఘ్న: నాస్తిక: శఠ:
సద్య: పాపాద్విముచ్ఛేత ప్రభావాత్‌ పరమాత్మన:

దురాచారము కలవాడైనా, అన్నింటినీ తినేవాడైనా, చేసిన మేలు మరచిన వాడైనా, నాస్తికుడైనా, పదిమందిని మోసగించే వాడైనా పరమాత్మ అనుగ్రహం లభిస్తే వెంటనే అన్ని పాపాలు తొలగి పరిశుద్ధుడవుతాడు.

దురాచారమంటే వేద, శాస్త్ర, పురాణతిహాసాలలో చేయకూడనివిగా పేర్కొన్నవి.

”తిష్టన్నాశి వివసన స్నాయి కళంజ భక్షక:
అమేయ పాయి పరస్త్రీ అభిలాషక:
అసత్య వచన: పరహింసా శీలి పరనిందారత: ”

- Advertisement -

తిష్టన్నాశి అనగా నిలబడి తినేవాడు,
వివసన స్నాయి అనగా వస్త్రము లేకుండా స్నానము చేయువాడు లేదా ఒకే వస్త్రముతో ఉండువాడు
కళంజ భక్షక: అనగా మాంసం భుజించువాడు
అమేయ పాయి అనగా మద్యం సేవించువాడు
పరస్త్రీ అభిలాషక: అనగా పరస్త్రీలను అభిలాషించువాడు
అసత్య వచన: అనగా అసత్యము పలుకువాడు
పరహింసా శీలి అనగా ఇతరులను హింసించే స్వభావం కలవాడు
పరనిందారత : అనగా ఇతరులను నిందించుటలో ఆసక్తి కలవాడు
ఇవన్నీ దురాచారములు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement