నీలగంగా తీర్థము గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
నీలపర్వతము నుండి ప్రవహించిన గోదావరి, శ్రేష్ఠమైన నీలగంగా తీర్థముగా ప్రసిద్ధి పొందినది. ఈ తీర్థమున స్నానము, దానము, హోమము, జపము, తర్పణము, పితృశ్రాద్ధము శ్రద్ధాభక్తులతో ఆచరించిన వారు అక్షయ ఫలమును పొందుదురు. పితృదేవతలు కూడా తృప్తి చెందుదురు. ఈ తీర్థములో చేసిన ఏ కొద్ది దానమైనా అనంత ఫలమునిచ్చును. ఈ తీర్థమున చేసిన గోదానము నూరు అశ్వమేధములతో సమానము. ఇచ్చట వస్త్రదానము చేసినచో వాయు లోకమునకు చేరెదరని నీలగంగా తీర్థ వైభమును బ్రహ్మ నారదునికి వివరించెను.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు….
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి