Monday, November 25, 2024

ధర్మం – మర్మం : వరాహ తీర్థము -2 (ఆడియతో..)

వరాహ తీర్థ వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యజ్ఞకల్పము కొరకు రసాతలమునకు చేరిన స్వామి దానిని సాధించి అదే మార్గంలో తిరిగి బయలుదేరి బ్రహ్మగిరిపై ఉన్న గోదావరీ నదీ ప్రవాహమును చేరి రాక్షసులను సంహరించినపుడు స్వామి తన శరీరమునకు అంటిన రక్తమును ప్రక్షాళన చేసుకొనెను. ఆ విధంగా వరాహస్వామి శరీరము ప్రక్షాళన చేసుకున్న ఆ ప్రాంతమున వరాహ గుండము ఏర్పడెను. తన ముఖమున ధరించిన యజ్ఞకల్పమును దేవతలకు ఇచ్చినందున నారాయణుని ముఖము నుండి యజ్ఞము ఏర్పడెనని తెలియచున్నది. స్వామి తన ముఖమును ‘స్రువ’ రూపముగా చేసుకొని యజ్ఞమును ఆవిర్భివింప చేసెను గాన ఆనాటి నుండి స్రువము ప్రధాన యజ్ఞాంగం అయ్యెను. మరొక కారణమున కూడా స్వామి వరాహ రూపమును ధరించెను కావున వరాహ తీర్థము అన్ని తీర్థములకంటే పుణ్యమైనది. ఈ వరాహ తీర్థములో స్నానము, దానము, హోమము ఆచరించినచో సకల క్రతువులను ఆచరించిన ఫలితము దక్కి సకల కామనలు నెరవేరును. ఈ తీర్థములో స్నానమాచరించి పితృశ్రాద్ధము చేసి పితృదేవతలను స్మరించిన వారు సకల పాపములు తొలగి పరి శుద్ధులగుదురు. వీరి పితరులు కూడా పుత్రులు స్మరించినందున సకల పాపముల నుండి విముక్తులై స్వర్గము చేరెదరని వరాహతీర్థ వైభవము గురించి
బ్రహ్మ నారదునికి చెప్పెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు….
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement