Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : పశ్చిమం దిక్కుపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు.

వీరిలో పశ్చిమం దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
పశ్చిమాధిపతి వరుణదేవుడు. ఇతను జలాధిపతి, వర్షాధిపతి. ప్రాణికోటికి నీరందించేవాడు, ఆపేవాడు వరుణుడే. ‘ఆపోవ ఇదగుం సర్వం విశ్వాభూతాని ఆప:’ అని వేదమంత్రం. అనగా సకల ప్రపంచము, స కల ప్రాణులు జలమే. జలమే నారాయణునకు నివాసం. నారములు అనగా జలం, నారములు ఆయనము(ఆధారం)గా కలవాడు నారాయణుడు. ప్రళయకాలములో ప్రపంచమంతా నశించినా నీరు నశించ దు. ఇంతటి ప్రశస్తి కల నీటికి అధిపతి వరుణుడు. ఇతను అశ్వములకు, గజములకు అధిపతి. అందుకే గజమును వారణము అని కూడా అందురు. పరమార్థంలో గుర్రములు అనగా ఇంద్రియములు, ఏనుగులు అనగా అహంకారం, వాటికి అధిపతి వరుణుడు. మన శరీరంలో ఏ వికారమైనా జల ము వలనే. కావున శరీరంలో నీరు ఎక్కువైనా, తక్కువైనా అనారోగ్యమే. శరీరంలో ప్రతీ మార్పునకు జలమే కారణం కావున ఇంద్రియజయం కావాలన్నా, అహంకారాన్ని జయించాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా వరుణ దేవుడిని పూజించాలి. వర్షాధిపతి కావున కరువు కాటకాలు సంభవించినప్పుడు వానల కోసం వరుణజపం చేయాలి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement