Thursday, November 21, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – బ్రాహ్మణుడు

బ్రాహ్మణుడు

సావిత్రీనామ మాత్రోపి వరో విప్ర: సుయం త్రిత:
నాయం త్రిత: త్రివేదోపి సర్వాశీ సర్వ విక్రయీ

కేవలము గాయత్రీ మంత్ర జపం చేసేవాడైనా ఆచారము కలిగి నియమబద్ధుడైన బ్రాహ్మణుడు, శ్రేష్టుడు. ఏ నియమాలను పాటించక కనబడిన ప్రతీ దానిని తింటూ మనస్సులో అనుకున్నవన్ని ఆచరిస్తున్న బ్రాహ్మణుడు మూడు వేదాలు చదువుకున్న బ్రాహ్మణత్వమును కోల్పోవును. ధర్మమును, నియమములను, ఆచారములను, ఉత్తమ ఆహారమును తీసుకొనుచూ అది మితముగా, హితముగా తీసుకుంటూ ఉన్న బ్రాహ్మణుడు గాయత్రీ జపం చేసుకుంటున్న వాడైనా అంటే వేదములను, వేదాంగములను చదువకున్నా ఆ బ్రాహ్మణుడు శ్రేష్ఠుడే.అన్ని వేదాలు చదివినా ఆచార వ్యవహార మరియు ఆహార నియమములను పాటించని వాడు అధముడని బ్రాహ్మణతత్త్వమును కోల్పోవునని భావము.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement