కార్తిక కృష్ణ ద్వాదశి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వి వరణ
కార్తిక కృష్ణ ద్వాదశిని గోవత్స ద్వాదశి అని అంటారు. ఈనాడు ఆవు-దూడను మరియు మర్రి వృక్షాన్ని పూజించాలి. మదనరత్నంలోని భవిష్యపురాణానుసారం…
సవత్సాం తుల్య వర్ణాంచ శాలినీం గామ్ పయస్వినీమ్
చందనాదిభి లాలిప్య పుష్పమాలాభి రర్చయేత్
అర్ఘ్యం తామ్రమయే పాత్రే కృత్వా పుష్పాక్షతై: తిలై:
పాద మూలేతు దద్వాద్వై మంత్రేనానేన పాండవ
అనగా ఒకే రంగు గల దూడతో ఉన్న పాలిచ్చు అవును చందనాదులతో ఆలేపనము చేసి పూల మాలతో అర్చించవలెను. రాగి పాత్రలో పూలు, అక్షతలు, నువ్వులు ఉంచి క్రింది మంత్రముతో ఆవు పాదమూలమున అర్ఘ్యమును వి డువ వలెను.
క్షీరోదార్ణవ సంభూతే సురాసుర నమస్కృతే
సర్వదేవమయే మాత: గృహాణార్ఘ్యం నమో నమ: ||
మినుములు, ఆవాలు, నువ్వులతో పిండి వంటలు చేసి నైవేద్యమీయవలెను. ఈవిధంగా గోవత్స పూజకు చేసిన పిండివంటలను, ఆవు పాలు, పెరుగు, నెయ్యిలను ఆవు పాదమూలమున విడువవలెను. తదుపరి దేవతలకు, బ్రాహ్మణులకు, ఆవులకు, ఉత్తములకు, లక్ష్మీసమానులైన స్త్రీలకు నీరాజనము అర్పించవలెను.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి