గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతముని ఆశ్రమంలోని ఋషులు – వినాయకుని సంభాషణ గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
గణపతి ప్రతిపాదనను ఆమోదించిన ఋషులు గౌతమ ఆశ్రమాన్ని విడువుటకు చేసే ఉపాయము గౌతమ మహర్షికి ఉపకారాన్ని, హితాన్ని కలిగించడమే కాక లోకానికి హితము కలిగి బ్రాహ్మణులందరికీ శ్రేయస్సు కలగాలని ఋషులు వినాయకునిని కోరెను. దీనికి అంగీకరించిన విఘ్నేశ్వరుడు ఇంతమంది మహానుబావులయిన మహర్షుల సేవ అనర్థాన్ని కలిగించదని శ్రేయస్సును, ప్రియమును, హితమును కలిగిస్తుందని పలికెను. ఋషులకు చేసిన సేవ ప్రభావం వలన గౌతమ మహర్షిపై హాని తలపెట్టినా చేయజాలనని పలికిన విఘ్నేశ్వరుడు బ్రాహ్మణ రూపంలో గౌతముడు, ఋషులకు నమస్కరించెను. తల్లి ఆజ్ఞ, అభిప్రాయానుసారం సోదరి జయను గోరూపమున గౌతమ ఆశ్రమానికి వెళ్ళమని విఘ్నేశ్వరుడు ఆజ్ఞాపించి అచట పెరిగిన పైరును తిని ధ్వంసం చేయమనెను. అది చూసిన గౌతముడు కొట్టినా, గద్దించినా, ఆగ్రహించినా మరణించిన ట్టు కాక జీవించినట్టు కాక నటించమని చెప్పగా జయ అదే విధంగా ఆచరించెను.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి