అయిదు రోజుల దీపావళి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులవారి వివరణ…
ధనత్రయోదశి, నరకచతుర్ధశి, మహాలక్ష్మీవ్రతం, బలి ప్రతిపత్, యమ ద్వితీయ అను ఐదు దినములు దీపావళి పర్వదినములు.
ధనత్రయోదశినాడు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టించి, నరకచతుర్థశి నాడు దంపతులకు మంగళహారతులు ఇచ్చి, అమావాస్యనాడు దీపాలు పెట్టి పాడ్యమి నాడు బలిధ్వజం ప్రతిష్టించి, విదియనాడు సోదర ప్రేమను లోకానికి చాట డమే అయిదు రోజుల దీపావళి.
స్థూలంగా లక్ష్మీనారాయణులను పూజించి నరకాన్ని నరుడులోని దౌష్ట్యాన్ని అజ్ఞానాన్ని అంథకారాన్ని తొలగించి దీపాలను వెలిగించి దాతృత్వంతో ఔదార్య ధ్వజాన్ని ఎగురువేసి వసుధైక కుటుంబత్వాన్ని అన్నాచెల్లెల అనుబంధాన్ని అఖిల ప్రపంచానికి అందించడమే అయిదు రోజుల దీపావళి పండుగలోని అంతరార్థం.
— శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్య..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి