మహాభారతంలోని సుభాషితంపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
2. న జాతి నకులం తాత నస్వాధ్యాయోన చశ్రుతమ్
కారణాని ద్విజత్వస్య వృత్తమేవహి కారణమ్
ద్విజత్వమునకు అనగా బ్రాహ్మణత్వమునకు జాతి, కులము, శాస్త్రము, అధ్యయనము కారణములు కావు, ప్రవర్తనే కారణము.
రావణాసురుడు, హిరణ్యకశిపుడు, నరకాసురుడు మొదలగు వారు జాత్యా బ్రహ్మాణులే కాని పరదారాపహరణము, పరద్రవ్యాపహరణము, మధ్యమాంస వ్యామోహము వారి పతనానికి కారణములయ్యాయి. ద్విజత్వము వారిని రక్షించ లేకపోయింది. గుహుడు నిషాదజాతివాడు, శబరి మతంగ యువతి, ధర్మవ్యాధుడు మాంసవిక్రేత కానీ వారి సత్ప్రవర్తనతో రామునితో సాహచర్య, సహవాస భాగ్యాన్ని పొందారు. సుగ్రీవాదులు వానరులు కానీ రామునికి మిత్రులు, సేవకులయ్యారు. అందుకే ప్రవర్తనే ద్విజత్వమునకు కారణము కానీ జాతి, కులము మొదలగునవి కావు.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి