Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : తపస్సు (ఆడియోతో…)

శివపురాణం ఉమాసంహిత 20వ అధ్యాయంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సుస్థిత: తపసీ బ్రహ్మా నిత్యం విష్ణు: హరస్థధా
దేవా దేవ్యోఖిలా ప్రాప్తా: తపసా దుర్లభం ఫలమ్‌
యేన యేనహి భావేన స్థిత్వా యత్‌ క్రియతే తప:
తత్తత్‌ సంప్రాప ్యతే అసౌ తైరిహ లోకే న సంశయ:

బ్రహ్మ వెయ్యి దివ్య సంవత్సరములు తపము చేసి అఖిల జగత్తును సృష్టించగలిగెను. విష్ణువు నిరంతరం తపస్సులోనే ఉండి అనంత కోటి బ్రహ్మాండాలను రక్షించుచున్నాడు. ఇక హరుడు అనగా శివుడు కఠినమైన తపస్సు తోటి జగత్సంహారం చేయుచున్నాడు. ఇలాగే లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ, శచీదేవి మొదలగు దేవపత్నులు, అఖిల దేవతలు తపస్సుతోటే ఇతరులు పొందరాని గొప్ప ఫలమును పొందిరి. ఏఏ భావనతో తపస్సు చేస్తారో ఆ భావనమునకు తగిన ఫలితం సంపూర్ణంగా ఇహలోకంలో వారు పొందుతారు, పరలోకంలో స్వర్గాన్ని పొందుతారు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement