శ్రీమద్భాగవతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
పుంసోయం సంసృతే: హేతు: అసంతోష: అర్ధ కామయో:
యదృచ్ఛయా ఉపపన్నేన సంతోష: ముక్తయే స్మృత:
అర్ధ కామముల విషయమున అసంతృప్తే మానవుని సంసారానికి కారణం. మన కర్మానుగుణంగా దైవ వశంతో లభించిన అర్థ కామములతో తృప్తి చెందుట ముక్తికి కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే అసంతృప్తి సంసారాన్ని, సంతృప్తి మోక్షాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ జన్మలో మనము కోరుకున్నవన్నీ తీరడం అసాధ్యం కావున ఆ మిగిలిన కోరికలను తీర్చుకోవడానికి మళ్లిd జన్మిస్తాము. పుట్టడమంటే సంసారమే. పొందిన దానితో తృప్తి కలిగిన నాడు ఇక కోరికలే ఉండవు. సంతృప్తి, సంతోషము, సహృదయము, సహకారము, సమన్వయ దృష్టి శతకోటి స్నాన, దాన, హోమ, జపాల కంటే మిన్న. సంతృప్తిని పొంది కోరికలను, ఇంద్రియాలను,మనస్సును గెలవడమే అన్ని వ్రతాలకు పరమార్థం. తృప్తి చెందినట్లయితే మనముందు అన్నీ ఓడినట్లే. తృప్తే నిజమైన ముక్తి, జీవన్ముక్తి కూడా.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి