మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
దానపద్ధతి
21.అక్రమ్య యద్ద్విజై ర్భుంక్తే పరిక్షీణౖశ్చ బంధుభి:
గో భిశ్చనర శార్దూల రాజ సూయా ద్విశిష్యతే
బ్రాహ్మణులు ఇది మన ఇల్లే అన్న భావనతో చొచ్చుకొని ఇంటిలోనికి వచ్చి ఎవని ఇంటిలో భోజనము చేయునో, క్షీణించిన అనగా ధనాదులు లోపించిన బంధువులు ఇది మన ఇల్లే అనుకొని వచ్చి ఎవని ఇంట్లో భుజింతురో గోవులు కూడా నిస్సంశయముగా ప్రవేశించి తృణాదులు భుజించినవానికి రాజసూయ యాగములను ఆచరించిన దాని కన్నా మించిన ఫలము లభించును.
అన్నం పెడ్తున్నానని పిలిచినపుడు వచ్చి భుజించుట కాక ఆకలి గొన్న బ్రాహ్మణుడు తన సొంత ఇంటిలోనికి వచ్చినట్లే ప్రవేశించి అడిగి భుజించవలయును. అనగా అన్నార్తలు ఎప్పుడు వచ్చినా అన్నము సిద్ధముగా ఉండాలి. బంధువులు కూడా నిస్సంకోచముగా వచ్చి భుజించకలగాలి. ఇక గోవులకు నిరంతరము గ్రాసము లభించాలి. గోవునకు ఒక పిరికెడు గడ్డి పెడితే స్వర్గము లభించును అని శాస్త్ర వచనం. ఆకలిగొన్న వారికి అన్నదానము వలన సకల యాగములను మించిన ఫలము లభించును అనునది పురాణ వచనము. నిరత దానము చేయు గృహము పుణ్యక్షేత్రమని అతని ఇంటి ముందు సకల దేవతలు కొలువుంటారు అని స్కాంద పురాణ వచనం. కావున ఇట్టి దాతకు స్వర్గములో కూడా గౌరవం లభస్తుంది.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి