మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
అసత్య పద్ధతి
14.
హన్తి జా తానా జాతాంశ్చ హిరణ్యార్థేనృతం వదన్
సర్వం భూమ్యనృతే హన్తి మాస్మ భూమ్యనృతం వదేత్
బంగారము విషయమున అసత్యము పలికినచో పుట్టిన వారు, పుట్టబోవు వారు కూడా నరకముల పాలయ్యెదరు. ఇక భూమి కొరకు అసత్యము పలికినచో సకలము అనగా వంశము అంతా నశించును. అందుకే భూమి కొరకు ఎపుడూ అబద్ధము ఆడరాదు.
ఇతరముల విషయమున అబద్ధములాడినా బంగారము కొరకు భూమి కొరకు అబద్ధమాడరాదు అని మహాభారతము హెచ్చరించుచున్నది. కాని ఈ కాలమున లోకమంతా భూమి కొరకే కుట్రలు, కుతంత్రాలు, కపటాలు, అసత్యసాక్ష్యాలు రహస్య పత్రాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి అకృత్యాల వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో మహాభారతరం ద్వారా తెలుస్తోంది కావున బంగారం మరియు భూమి విషయంలో నిజాయితీగా ఉండటం శ్రేయస్కరం.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి