Wednesday, November 13, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – సత్యపద్ధతి (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

సత్యపద్ధతి
12.
న నర్మయుక్తం హ్యానృతంహినస్తి న స్త్రీలు రాజన్‌ నవివాహకాలే
ప్రాణాత్యయే సర్వధనా పహారే పంచానృతా న్యాహురపాతకాని

పరిహాస పూర్వకమైన అసత్యము ఎవ్వరినీ హింసించదు. స్త్రీల విషయమున, వివాహ విషయమున, ప్రాణాపాయస్థితిలో, సకల ధనములను అపహరించు సందర్భములో ఆడిన ఈ ఐదు అసత్యములు పాతకములను కలిగించవు అని మహాభారతము ఉవాచ.

పరిహాసముగా ఎవరినైనా దేవాది దేవులండీ అని పొగడటం పాపము కాదు.అలాగే వివాహమునకు ఆటంకం రాకుండా చెప్పే అసత్యాలు వలన ఎవరికీ హాని కలుగదు కావున తప్పు కాదు. స్త్రీల విషయములో వారికి కోపము రాకుండా ఉండటానికి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ‘నీ వేనా ప్రాణము ‘అన్న భర్తమాట అసత్యమని తెలిసినా ఇది మెప్పుకోలు అని ప్రతీ భార్య గ్రహిస్తుంది. ఇక ప్రాణాపాయమున, ధనాపహరమున ఆడిన అబద్ధము పాతకమును కలిగించదు. ఇట్లు ఈ అయిదు అసత్యములు పాపములను కలిగించవు అని భారతము చెప్పుచున్నది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement