మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
8. అధర్మ పద్ధతి
అధర్మేణౖ ధతే తావత్ తతో భద్రాణి పశ్యతి
తతస ్సపత్నాన్ జయతి స మూలస్తు వినశ్యతి
అధర్మమును అవలంబించుచూ తాత్కాలికముగా అభివృద్ధని పొందును, శుభములను కూడా చూచును. ఆ తరువాత శత్రువులను గెలుచును కాని చివరికి సమూలముగా నశించును.
అధర్మమును అవలంబించువాడు ప్రారంభమున బాగా వృద్ధి చెంది శుభములను కనుగొని శత్రువులను జయించును. ఇక నాకేమని విర్రవీగి అధర్మ ఆచరణలోనే విజృంభించును. రావణాసురుడు లక్షల సంవత్సరములు మూడు లోకములను జయించి తనకెదురు లేనట్లుగా వ్యవ హరించాడు. హిరణ్య కశిపుడు 71 మహా యుగములు మూడు లోకములను పాలించాడు చివరకు రాక్షస పరివారముతో సహా నశించారు. అధర్మమును ఆచరించినవారే కాక వారికి అండగా నిలిచినవారు, చూచిన వారు, ప్రోత్సహించిన వారు అందరూ నశించినారు కావున అధర్మాచరణ వలన సమూలంగా నశించెద రని భావం.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి