Sunday, November 24, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – ధర్మ పద్ధతి(ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

7.ధర్మ పద్ధతి
నాచ్ఛాదయతి కౌపీనం న దంశమశ కాపహమ్‌
శున: పుచ్ఛమివ వ్యర్థం పాండిత్యం ధర్మవర్జితమ్‌

గుప్తావయమును కప్పనిది, ఈగలను, దోమలను తొలగించలేని కుక్కతోక వలె ధర్మ వర్జితమైన పాండిత్యము వ్యర్థము కదా

కుక్కతోక ఆ కుక్క రహస్యాంగమును కప్పలేదు. ఈగలు, నల్లులు, దోమలు వాలుతుంటే వాటిని పారద్రోల లేదు. అయినా తోక ఉండి ఎప్పుడూ ఊగుచుండును. అలా ఏమాత్రము పనికి రాని కుక్కతోక వలె ధర్మహీనమైన పాండిత్యము వ్యర్థము. ‘జ్ఞానం భార: క్రియాం వినా ‘ అని ఆర్యోక్తి అనగా ఆచరణ లేని జ్ఞానము బరువే, అట్లే ధర్మమును అనగా శాస్త్రము చెప్పిన దానిని ఆచరించని శాస్త్ర జ్ఞానము వ్యర్థమని తాత్పర్యము.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement