Friday, November 22, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – 4 (ఆడియోతో..)

హితోపదేశంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

వస్త్రేణ వపుషావాచా విద్యయా వినయేనవా
వకారైహి పంచబి: నరో నాప్నోతి గౌరవమ్‌

వస్త్రము, సుందరమైన – బలిష్టమైన శరీరము, సత్య ధర్మ బద్ధమైన వాక్కు, సద్విద్య, వినయము ఈ ఐదు వకారములు లేనివాడు అన్ని వికారములు ఉన్నవాడే అనగా గౌరవమును పొందజాలడు.

అత్యంత విలువైన పట్టు పీతాంబరమును పదికిలోల బరువు కూడా లేని శుష్కదేహుడు ధరిస్తే వన్నె రాదు అలాగే ధృఢమైన, సుందరమైన దేహమున్న వాడు అచ్చిద్ర, దరిద్రమైన అనగా చిరిగిన వస్త్రమును కట్టుకున్నా శోభించడు. ధృఢమైన దేహము, విలువైన వస్త్రమును ధరించిననూ పది మందిని మురింపించు మంచి వాక్కు లేనివాడు శోభించడు. విలువైన వస్త్రము, ధృఢమైన శరీరము, మంచి వాక్కు ఉన్నా చక్కని విద్య లేనివాడు శోభించజాలడు. ఈ నాలుగు ఉన్ననూ వినయము లెెనివాడు శోభించడు. కావున ప్రతి వ్యక్తికి వస్త్రము, వపువు(శరీరము), వాక్కు, విద్య, వినయము ఈ ఐదు తప్పక ఉండవలయును. ఈ ఐదు వకారములే మన సంపద.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement