Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(10) (ఆడియోతో…)

మార్కండేయ పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

కుటుంబం పీడ యిత్వాతు బ్రాహ్మణాయ మహాత్మనే
దాతవ్యం భిక్షవేప్యన్నమ్‌ ఆత్మనోభూతి మిచ్ఛతా

తన అభివృద్ధి ని కోరుకున్నవాడు కుటుంబానికి పెట్టవలసిన దానిలో కొద్ది భాగం తగ్గించి వారికి బాధ కలిగినా ఆక లితో అల్లాడుచూ భిక్షాటనకు వచ్చిన మహానుభావుడయిన బ్రాహ్మణునకు కొంత అన్నమును దానం చేయవలయును. ఇచట ‘బ్రాహ్మణాయ’ అని ఉన్ననూ ఆకలిగొని భిక్షాటనకు వచ్చిన వారు ఎవరైనా వారి ఆకలి తీర్చుటకు తాను తన కుటుంబం తినే దానిలో రెండు ముద్దలు ఆ భిక్షకునికి దానం చేయవలయును. అన్నముకై అలమటించే వారు ఎవరని విచారించక దానము చేయవలెనని మనువు చెప్పెను.

రంతి దేవుడు 12 రోజులు ఉపవాసము ఉండి తన భార్యాబిడ్డలతో కూర్చుని భుజించబోగా ఒక బ్రాహ్మణుడు దేహీ అంటూ తన ఇంటి వద్దకు రాగా తమకు ఉన్నదానిలో సగం అతనికి ఇచ్చెను. మిగిలిన దానిని భుజించబోగా ఆకలిగొన్న ఒక క్షత్రియుడు వచ్చి యాచించగా అప్పుడు ఉన్నదానిలో సగం అతనికి దానం చేసెను. మిగిలిన నాల్గవ భాగాన్ని రంతి దేవుడు కుటుంబం తినాలనుకోగా ఆకలిగా ఉన్న ఒక వైశ్యుడు వచ్చి యాచించగా అందులో సగం అతనికి ఇచ్చెను. ఇక మిగిలిన ఎనిమిదో భాగం మాత్రమే తినబోగా ఆకలిగొన్న శూద్రుడు దేహీ అంటూ రాగా ఆ మిగిలినది అతనికి దానం చేశాడు రంతిదేవుడు. ఇక తినడానికి తన వద్ద ఏమీ లేకపోగా ఉన్న చల్లని పానీయాన్ని తాగి కడుపు నింపుకోవాలని చూడగా ఆకలంటూ వచ్చిన చండాలుడికి రంతిదేవుడు తన వద్ద అన్నము లేదని కొన్ని మధురాంబువులు ఉన్నవని ప్రేమగా ఆ నీరు తాగమని ఇచ్చాడు. ఇంతకూ రంతిదేవుని వద్దకు వచ్చిన వారు సాక్షాత్తు ఇంద్ర, యమ, అగ్ని, వరుణ, కుబేరులు. రంతిదేవుడిని పరీక్షించాలనే సంకల్పంతో వచ్చిన దేవతలు అతని దాన గుణానికి సంతసించి అఖండ సామ్రాజ్యాన్ని, అఖిల భోగములను ప్రసాదించిరి.

ఆకలిగొన్నవారు ఎవ రు వచ్చి అర్ధించినా తన కున్న దానిలో తను తింటున్నదానిలో కొంత ఇవ్వాలని మార్కండేయ పురాణంలోని చెప్పిన ఈ వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తోంది.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement