Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : భగీరథుడు శ ంకరుని ప్రార్థించిన విధానం(ఆడియోతో)..

గంగా ఆవిర్భావ వృత్తాంతములో భాగంగా భగీరథుడు శ ంకరుని ప్రార్థించిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గంగా ఆవిర్భావ వృత్తాంతములో భాగంగా భగీరథుడు శ ంకరుని ప్రార్థించిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బాలుడయిన భగీరథుడు అన్ని క్రియలను ఆచరించి పరిశుద్ధుడై తపస్సుకు నిశ్చయించుకొని బాలచంద్రాధరా! తాను బాలుడను, తనది బాలబుద్ధి కావున ప్రీతి చెంది దయతో తనకు ఉత్తమ వాక్కులను ప్రసాదిం చమని శంకరుడు దయతో అందించిన వాక్కులతో చేసిన స్తుతులు తనకు ఉపకరించి హితమును కలిగించినచో తాను స్తుతించగలనని శంకరునికి నివేదించెను. తాను నమస్కారము మాత్రమే చేయగలను అని తనకు ఏ విద్యలు రావని కావాల్సిన జ్ఞానమును, వాక్కును ప్రసాదించి నీవే నీ స్తోత్రము చేయుంచుకొమ్మని శంకరునితో పలికెను. తనకు తల్లి, తండ్రి, చదువులమ్మవు అయిన నీవు తాను చేయవలసిన స్తోత్రాన్ని తన నాలుకపై కూర్చుని పలికించమని ప్రార్థించెను. తన ముత్తాతలు దుర్గతి పాలై ఉన్నారు కావున వారికి ఉత్తమ గతిని ప్రసాదించ డం మాత్రమే తనకు తెలుసునని శంకరునికి నమస్కరించెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement