Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : భోజనం – 2 (ఆడియోతో…)

భారంతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భోజనం…

భుక్త్వా చోపస్పృశేత్‌ సమ్యక్‌ అద్భి: ఖానిచ సంస్పృశేత్‌
తధాన్నం పూజయేత్‌ నిత్యమ్‌ అద్యాచ్చైతత్‌ అకుత్సయన్‌
దర్శనాత్‌ తస్య హృష్యేద్వై ప్రసీదేచ్చాపి భారత

భోజనము చేసిన పిదప చేతులు, కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి నీటితో ఇంద్రియములను స్పృశించవలయును. ఇంద్రియములు అనగా రెండు కన్నులు, రెండు చేతులూ, నాసికా, నోరు ఈ ఐదింటిని స్పృశించడమనగా నీటితో తుడుచుకొనవలయును. భోజనము చేసే ముందు అన్నమును పూజించి అన్నమును నిందించకుండా, ధూషించకుండా భుజించవలయును. భోజన పదార్థాలను చూసిన వెంటనే సంతోషించి ప్రసన్నుడు కావలెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement