Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : కర్మశ్రేష్టుడు, కర్మభ్రష్టుడు -4 (ఆడియోతో…)

పరాశర స్మృతిలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

కర్మశ్రేష్టుడు, కర్మభ్రష్టుడు 4

ద్వావింశతే: క్షత్రబంధో: ఆచతుర్వింశ తేర్విశ:
అతఉర్ధ్వంతు యే రాజన్‌ యధాకాలం అసంస్కృతా:
సావిత్రీ పతితా వ్రాత్యా: సోమోచ్యతే క్రతో:
నచాప్యేభి: అపూతైస్తు ఆపద్యపి కరిహి చిత్‌
బ్రాహ్మం ¸°నంచ సంబంధమ్‌ ఆచరేత్‌ బ్రాహ్మణస్యహి

క్షత్రియునకు 22 సంవత్సరముల వరకు, వైశ్యనకు 24 సంవత్సరములలోపు ఉపనయనమును చేయవచ్చును. 16 సం || దాటిన బ్రాహ్మణునకు ఉపనయనం చేయనిచో వారు గాయత్రీభ్రష్టులగుదురు అపుడు ఉపనయము చేసినా బ్రాహ్మణత్వము లభించదు. అదేవిధంగా 22 సం||ల తర్వాత క్షత్రియునకు, 24 సం||ల తరువాత వైశ్యునకు ఉపనయనము చేసినచో ద్విజత్వము సిద్ధించదు, వీరు సావిత్రీ పతితులగుదురు. ఇటువంటి వారిని వ్రాత్యులు అని అందురు. అన్ని క్రతువుల నుండి భ్రష్టులగుదురు. ఈ విధంగా అపవిత్రులు అయిన కర్మ భ్రష్టులయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులతో బ్రాహ్మణత్వ సంబంధమును కానీ, బంధుత్వమును కలుపుకొనే వివాహాదులు కానీ ఎంత ఆపద వచ్చినా చేయరాదు. అటువంటి వ్రాత్యులతో కలిసి సహపంక్తి భోజనము, ఏకాసనముపై కూర్చొనుట, ఒకే శయ్యపై పడుకొనుట, ఒకే అంశం పై చర్చించుట చేసినచో వారు కూడా కర్మభ్రష్టులు అగుదురు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement