Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 30(1)

స్కాంద పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

రాజా నరపతిశ్చైవ గ్రామ ఖేట పతి: సదా
అధికారీ పాలకశ్చ రాజ్యసంచాలక స్తధా
స్వస్య స్వస్య పరీచారమ్‌ దాసీం సం సేవికాం సదా
ప్రధమం లాలయేత్‌ నిత్యం తతోఅమాత్యాది సత్క్రియామ్‌
ఏవంచేత్‌ రాజ్య లాభస్స్యాత్‌ అన్యధా రాజ్య భేధనమ్‌
అధికార భంగ: వాస: వనే క్లేశపరంపరరా
సంభవత్యేవ లోకేస్మిన్‌ మానయేత్‌ పరిచారకాన్‌
దాసీ జనంచ కుశలీ సర్వసంపద మవాప్నుయాత్‌

రాజు కాని, నర పాలకుడు కానీ, గ్రామాధిపతి కానీ, ఖేటము (చిన్నచిన్న గృహముల సముదాయము)ను పరిపాలించువాడు, అధికారి, పాలకులు రాజ్యమును నడుపువాడు – తన తన పరిచారకులను, దాసీ జనమును, సేవికను మొదట లాలించవలయును. ఆ తరువాత అమాత్యులు మొదలగువారిని సత్కరించవలయును. ఈవిధంగా చేసినచో రాజలాభము కలుగును. దాసీజన పరివారాన్ని లెక్కించనిచో రాజభంగము, అధికార భంగము, వనవాసము, సదాక్లేశము సంభవించును. కావున పరిచారిక జనాన్ని లాలించినచో సకల సంపదలు కలుగును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement