Thursday, November 21, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 28 (ఆడియోతో…)

ఇతిహాస సముచ్ఛయంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

లోక చిత్తావతారార్ధం వర్జైఇత్యాతు తేనతౌ
ఇతిహాసె: పవిత్రార్ధై: పునరత్రైవ నిందితౌ
అన్యదా ఘోర సంసారే పతితస్య జనస్యతౌ
వర్ణయేత్‌ సకలం విద్వాన్‌ మహాకారుణికో ముని:

మహర్షులు లోకుల మానసిక ప్రవృత్తిని బోధించడానికి కామమును, లోభమును విడిచిపెట్టి ప్రవర్తించమని పవిత్రమైన అర్థములు కల రామాయణ భారాతాది ఇతిహాసములలో కామలోభములను నిందిస్తూ వర్ణించి ఉన్నారు. అలా కాని నాడు ఘోరమైన సంసారంలో పడిన జనులు కామ, లోభాలనే పట్టుకొని ప్రాకకులాడుతుంటారు. పవిత్రార్థములైన ఇతిహాసములను విన్న నాడు జ్ఞానము పొందిన విద్వాంసుడు కామలోభాలను విడిచిపెడతాడు. ఇలా కామాలోభాల గురించి ఇతిహాసములలో కనులకు కట్టినట్టు వర్ణి ంచి, వాటి భయంకర స్వరూపాన్ని తెలియజేసి, జ్ఞానులు కామలోభములను వదిలేలా చేసిన వ్యాస వాల్మీకి వంటి మహామునులు ఎంతటి దయగలవారో!

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement