Monday, November 25, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 25 (ఆడియోతో…)

స్కాంద పురాణం, పాతాళ ఖండంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

ప్రధమం భగవత్‌ సేవా తత్‌ కృపా తదనంతరమ్‌
తత: తద్ధర్మ గ్రహణమ్‌ తత్కధా శ్రవణం పశ్యాత్‌
తధా భగవతి రతి: తతశ్చ ఆత్మ జ్ఞానమ్‌
భగవత్‌ కృపయా సర్వం భగవతి విమలా మతి:
తతశ్చ భగవత్‌ ప్రాప్తి: క్రమోయం సర్వదా స్థిత:

మొదట భగవంతుని భక్తి భావంతో సేవించాలి. ఆ సేవ కూడా భగవంతుని దయ వల్లనే కలుగుతుంది. ఇలా భగవంతుని దయ వలన భగవంతుని సేవ చేసి, భగవత్‌ భక్తులు ధర్మాలను తెలుసుకొని ఆచరించాలి. అందులో ప్రధానమైనది భగవంతుని కథలను, భక్తల కథలను నిరంతరం వింటూ ఉండాలి. అలా వినటం వలన పరమాత్మ యందు ప్రీతి కలిగి తద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మ జ్ఞానం కూడా భగవంతుని కృపతో, పరిశుద్ధమైన బుద్ధితో ఉపాసన చేయడం వలన కలుగుతుంది. ఇలా చేసిన ఉపాసనతో భగవంతుని చేరగలము. ఇది భగవత్‌ ప్రాప్తి క్రమం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement