గరుడ పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….
దురాచారోపి సర్వాశీ కృతఘ్న: నాస్తిక: శఠ:
సద్య: పాపాద్విముచ్ఛేత ప్రభావాత్ పరమాత్మన:
దురాచారము కలవాడైనా, అన్నింటినీ తినేవాడైనా, చేసిన మేలు మరచిన వాడైనా, నాస్తికుడైనా, పదిమందిని మోసగించే వాడైనా పరమాత్మ అనుగ్రహం లభిస్తే వెంటనే అన్ని పాపాలు తొలగి పరిశుద్ధుడవుతాడు.
దురాచారమంటే వేద, శాస్త్ర, పురాణతిహాసాలలో చేయకూడనివిగా పేర్కొన్నవి.
”తిష్టన్నాశి వివసన స్నాయి కళంజ భక్షక:
అమేయ పాయి పరస్త్రీ అభిలాషక:
అసత్య వచన: పరహింసా శీలి పరనిందారత: ”
తిష్టన్నాశి అనగా నిలబడి తినేవాడు,
వివసన స్నాయి అనగా వస్త్రము లేకుండా స్నానము చేయువాడు లేదా ఒకే వస్త్రముతో ఉండువాడు
కళంజ భక్షక: అనగా మాంసం భుజించువాడు
అమేయ పాయి అనగా మద్యం సేవించువాడు
పరస్త్రీ అభిలాషక: అనగా పరస్త్రీలను అభిలాషించువాడు
అసత్య వచన: అనగా అసత్యము పలుకువాడు
పరహింసా శీలి అనగా ఇతరులను హింసించే స్వభావం కలవాడు
పరనిందారత : అనగా ఇతరులను నిందించుటలో ఆసక్తి కలవాడు
ఇవన్నీ దురాచారములు.
–శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి