Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 13 (ఆడియోతో…)

పద్మ పురాణం, భూమి ఖండంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

లౌకికం వైదికం వాపి తదాధ్యాత్మిక మేవవ
ఆదదీత యతో జ్ఞానమ్‌ తం పూర్వం అభివాయేత్‌

లౌకికమైన, వైదికమైన, ఆధ్యాత్మికమైన ధ్యానమును మనకు అందించిన వారు కనబడితే మొదలు వారికి నమస్కారం చేయాలి.

ఎవరికీ అపకారం చేయకుండా, మరెవరినీ మోసగించకుండా, ఎవరి సొమ్ము హరించకుండా, తనకు కావాల్సిన, తాను బ్రతకవలసిన విధానాన్ని తెలిపే జ్ఞానము లౌకిక జ్ఞానము. వేదములలో అందించిన ఇహలోక, పరలోక, పరమ పదములను పొందుటకు కావాల్సిన జ్ఞానము వైదిక జ్ఞానము. ఇహము, పరము అన్నీ పరమాత్మ శరీరమే. ఆ పరమాత్మను తెలుసుకొంటే అన్నీ తెలిసినట్టే. అన్ని పనులకు, ప్రయత్నాలకు లక్ష్యం పరమాత్మను చేరడమే. ఈ లోకంలో లభించే సుఖాలు, సంతోషాలు చాలా అల్పములు, అస్థిరములు. ఉదాహరణకు ఉదయం విచ్చుకున్న పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది, కావున ఈ లోకంలోను, పరలోకంలోను లభించే అనుభూతి క్షణికము మరియు అల్పమే. ఒక్క పరమాత్మే నిత్యమూ, సత్యము, శాశ్వతమైన ఆనందం అని చెప్పేది ఆధ్యాత్మిక జ్ఞానము. ఇలా ఈ మూడింటిలో ఏ జ్ఞానాన్ని మనకు అందించిన వారైనా ఎదురుపడితే ముందుగా లేచి నమస్కారం చేయాలి.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement